Trisha Krishnan | ఇటీవల తమిళ నటుడు మన్సూర్ వ్యాఖ్యల కారణంగా అయిన రచ్చ మరువకముందే మరో వ్యక్తి త్రిషపై అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చాడని అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసభ్యకరమైన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
త్రిషకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తమిళ నటుడు మన్సూర్ వ్యాఖ్యల కారణంగా అయిన రచ్చ మరువకముందే మరో వ్యక్తి త్రిష గురించి అసహస్యకరంగా మాట్లాడాడు. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చాడని అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు ఏవీ రాజుపై మండిపడుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా త్రిష గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. ఆయన్ను అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
తనపై అన్నాడీఎంకే బహిష్కృత నేత చేసిన కామెంట్స్‌పై త్రిష కూడా సీరియస్ అయ్యింది. ఫేమస్ కావడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవి అంటూ మండిపడింది. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుందని పేర్కొంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఈ విషయంపై తన లీగల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏవీ రాజు కామెంట్స్‌పై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా త్రిష స్పందించింది.
ఇక త్రిష విషయానికొస్తే నాలుగు పదుల వయసులోనూ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తన అందం, అభినయంతో ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన ఛాన్స్‌లు కొట్టేస్తోంది. రీసెంట్గా పొన్నియన్ సెల్వన్, లియో వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభరలోనూ మెయిన్ లీడ్‌గా ఛాన్స్ కొట్టేసింది.