దాదాపు 22ఏండ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా కెరీర్‌ను సాగిస్తున్నది అందాలభామ త్రిష. ఇప్పటికీ ఆమె చేతినిండా సినిమాలున్నాయి. అయితే.. ఆమె ఒక్కసారిగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు చెప్పి అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ బ్రేక్‌కి బలమైన కారణమే ఉందని ఈ సందర్భంగా త్రిష తెలిపింది. తాను ఎంతో ప్రేమించే తన పెంపుడు కుక్క జోర్రో ఇటీవలే మరణించిందట. ఈ విషయం గురించి త్రిష చెబుతూ ‘జోర్రో మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.
తను లేకపోతే ఇల్లు బోసి పోయింది. ఈ పరిస్థితుల్లో సినిమాలపై దృష్టి పెట్టలేను. అందుకే కొన్ని రోజులు షూటింగులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.’ అని తెలిపింది. ఈ వార్త తో త్రిష అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. త్రిష తన పెంపుడు కుక్కను ఎంత ప్రేమించిందో ఈ నిర్ణయాన్ని బట్టి చెప్పొచ్చని వారు అంటున్నారు. మరి నిర్మాతల పరిస్థితేంటో?