Identity Teaser | తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో లీడింగ్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది చెన్నై సుందరి త్రిష (Trisha). ఈ భామ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఐడెంటిటీ (Identity). మలయాళంలో త్రిష రెండో ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీలో టొవినో థామస్ హీరోగా నటిస్తున్నాడు. క్రైం థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ సినిమాలో వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తున్నాడు.
ఐడెంటిటీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీజర్ విడుదల చేశారు మేకర్స్. అతని ముఖాన్ని రఫ్‌గా గీద్దాం అని టోవినో థామస్ త్రిషకు చెప్పే డైలాగ్‌తో షురూ అయింది టీజర్. త్రిష హంతకుడి గురించి మాట్లాడటం.. అతడిని గెస్ చేయడం.. ఆమె చూసిన క్రైంకు వినయ్రాయ్కు సంబంధమేంటి.. ఈ క్రైంలో టోవినో థామస్ పాత్రేంటనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై హైప్ పెంచేస్తుంది. ఐడెంటిటీ సినిమాను అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఐడెంటిటీ టీజర్..
Fahadh Faasil | వెడ్డింగ్‌లో పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్.. ఇంతకీ ఎవరిదో తెలుసా..?
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?