Identity | చెన్నై సుందరి త్రిష (Trisha)కు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ భామ ఇటీవలే నటించిన మలయాళ చిత్రం ఐడెంటిటీ (Identity). మాలీవుడ్ స్టార్ యాక్టర్ టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 2న మలయాళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ మూవీ తెలుగులో జనవరి 24న విడుదల కాగా.. మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. తెలుగులో విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఐడెంటిటీ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం అందుబాటులో లేదు. మరి హిందీలో కూడా యాడ్ చేస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.
క్రైం థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రంలో వినయ్ రాయ్ విలన్‌గా నటించాడు. టీజర్ అతని ముఖాన్ని రఫ్‌గా గీద్దాం అని టోవినో థామస్ త్రిషకు చెప్పే డైలాగ్‌తో షురూ కాగా.. త్రిష హంతకుడి గురించి మాట్లాడటం.. అతడిని గెస్ చేయడం.. ఆమె చూసిన క్రైంకు వినయ్రాయ్కు సంబంధమేంటి..? ఈ క్రైంలో టోవినో థామస్ పాత్రేంటనేది సస్పెన్స్‌లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయి. ఈ చిత్రాన్ని అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. మలయాళంలో ఇది త్రిషకు రెండో ప్రాజెక్ట్.
𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 🤩🍿
𝗡𝗼𝘄 𝗦𝘁𝗿𝗲𝗮𝗺𝗶𝗻𝗴#Moana2 (English) – PrimeVideo Rent (Outside India Only)#TheHuntingParty (English+ Multi) – JioCinema
𝐉𝐚𝐧𝐮𝐚𝐫𝐲 𝟐𝟖#Paradise (English) Series – Disney+ & Hulu#Babygirl (English) – PrimeVideo Rent… pic.twitter.com/VdMPTL1r5p
— OTT Trackers (@OTT_Trackers) January 27, 2025
ఐడెంటిటీ టీజర్..
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!