సోషల్‌మీడియా ట్రోలర్స్‌పై అగ్ర కథానాయిక త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిది విషపూరిత మనస్తత్వమని, అలాంటి వారు రాత్రిళ్లు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతారని ప్రశ్నించింది. ‘పనీపాట లేకుండా ఖాళీగా ఉంటూ పిచ్చి పోస్ట్‌లతో కాలక్షేపం చేయడమేనా మీ పని? నిజంగా మిమ్మల్ని చూస్తే భయమేస్తుంది. అలాగే మీతో పాటు ఉండే సన్నిహితులు, స్నేహితుల విషయంలో బాధగా అనిపిస్తున్నది. పిరికివారు, మానసిక స్థితి సరిగ్గా లేని వారు మాత్రమే అకారణంగా విద్వేషాన్ని ప్రదర్శిస్తారు. మీ అందరికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవున్ని కోరుకుంటున్నా’ అని త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. గతంలో కూడా సోషల్‌మీడియా తప్పుడు వార్తలపై త్రిష అసహనం వ్యక్తం చేసింది. అజిత్‌తో కలిసి త్రిష నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష పర్ఫార్మెన్స్పై కొందరు ట్రోల్స్ చేశారు. తమిళ అమ్మాయి అయివుండి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఏమాత్రం బాగోలేదని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రోలర్స్‌ను ఉద్ధేశించి త్రిష తాజా పోస్ట్ పెట్టిందని అంటున్నారు.