Triptii Dimri | యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి (Triptii Dimri). ఈ సినిమా ఇచ్చిన హిట్‌తో ఓవర్‌నైట్‌గా స్టార్‌గా మారడమే కాకుండా వరుస సినిమాలు చేస్తుంది. అయితే ఈ భామ తాజాగా నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించింది. సామన్య భక్తురాలిగా ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుని గుడిలోకి వెళ్లి త్రయంబకేశ్వరుడిని దర్శించుకుంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలలో త్రిప్తి కాషాయ రంగు కుర్త ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
సినిమాల విషయానికి వస్తే.. ‘యానిమల్’ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’తో పలకరించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆనంద్ తివారీ తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది.

Triptii Dimri

Triptii Dimri

Triptii Dimri

Triptii Dimri

Triptii Dimri

Triptii Dimri

Triptii Dimri