Tripti Dimri | ‘యానిమల్’ భామ త్రిప్తి దిమ్రీ మంచి ఖుషీ మీదున్నది. ‘యానిమల్’తో రాత్రికి రాత్రికి నేషనల్ క్రష్‌గా అవతరించిన ఈ అందాలభామ ప్రస్తుతం ‘బ్యాడ్‌న్యూస్’ సక్సెస్‌ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నది. ఇటీవల ఆ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న త్రిప్తి ‘యానిమల్’పై ఆసక్తికరంగా మాట్లాడింది. ‘ప్రేక్షకులు మెచ్చిన సినిమా ఎప్పుడూ గొప్ప సినిమానే. ‘యానిమల్’ని విమర్శించేవాళ్లు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ‘యానిమల్’ కోట్లాదిమందికి చర్చించుకునే అవకాశం ఇచ్చింది. నీడనిచ్చే చెట్టు కిందకే మనుషులు చేరతారు.
కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయ్. ‘యానిమల్’ నా దృష్టిలో గొప్ప వృక్షం లాంటిది. నాలాంటి ఎందరికో ఆ సినిమా నీడనిచ్చింది. అంత మంచి సినిమాలో భాగమైనందుకు ఇప్పటికీ ఆనందిస్తూనే ఉన్నా. ఈ రోజు ఇంత బిజీగా ఉన్నానంటే కారణం ‘యానిమల్’ సినిమానే. అందుకే ‘బ్యాడ్‌న్యూస్’ సెక్సస్ని కూడా ‘యానిమల్’కే అంకితం ఇస్తున్నా. ‘యానిమల్ పార్క్’ గురించి అందరిలాగే నాకూ తెలీదు. ఆ కథ ఏమిటో, ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా క్లారిటీ లేదు. అది సందీప్గారే చెప్పాలి.’ అని చెప్పుకొచ్చింది త్రిప్తి దిమ్రీ. 2026లో ‘యానిమల్ పార్క్’ ప్రారంభిస్తామని గతంలో సందీప్‌రెడ్డి వంగా తెలిపిన విషయం విదితమే.