అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నిర్మాత కె.ఎల్.దామోదరప్రసాద్, దర్శకుడు సముద్ర, నటి ఇంద్రజ, నటుడు శుభలేఖ సుధాకర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్రం తప్పకుండా ప్రజాదరణకు నోచుకుంటుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వెలిబుచ్చారు. అన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కిషన్ సాగర్, నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు, సహనిర్మాత: ఎన్.పి.సుబ్బారాయుడు.