చెన్నైలోని పెరంబూర్ బిన్నీ మిల్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఎస్. జే. సూర్య తాజా చిత్రం ‘కిల్లర్’ షూటింగ్ స్పాట్లో బుధవారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సినిమాలో ఒక బాంబు బ్లాస్ట్ సీన్‌ను చిత్రీకరించడం కోసం స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్ ఏర్పాట్లు చేస్తుండగా, యాక్షన్ సీక్వెన్స్ కోసం ఉపయోగిస్తున్న ఒక గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పెను ప్రమాదంలో స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు టెక్నీషియన్లు తీవ్రంగా గాయపడగా, వారిలో మధురవాయల్‌కు చెందిన మదన్ (25) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్రంగా గాయపడిన దినకరన్, సూర్య, శక్తివేల్ అనే మరో ముగ్గురు టెక్నీషియన్లను చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ సమాచారం అందుకున్న ఓట్టేరి పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టెక్నికల్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదా షూటింగ్ స్పాట్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో నటుడు ఎస్. జే. సూర్య స్పాట్లో ఉన్నారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు, అలాగే చిత్ర యూనిట్ నుంచి కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఘోర దుర్ఘటన కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.
An accident has occurred on the set of #Killer, the film directed by #SJSuryah.
Accident scene pic.twitter.com/OYsW1R6ZJh
— Movie Tamil (@_MovieTamil) June 3, 2026