Toxic | మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సమయంలో ఇప్పుడు కొత్త సవాల్ ఎదురుకానుంది. యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ‘ఇరుముడి’ థియేట్రికల్ రన్‌పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో రెండు సినిమాల మధ్య థియేటర్ల పంపిణీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.‘టాక్సిక్’ విడుదల రోజున మీలాదునబీ, ఓనం పండుగలు కలిసి రావడం సినిమాకు అదనపు బలంగా మారనుంది. సెలవు రోజు కావడంతో భారీ ఓపెనింగ్స్ సాధించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. యశ్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, భారీ స్థాయి ప్రమోషన్స్, సెలవు అడ్వాంటేజ్.. ఇలా పలు అంశాలు ‘టాక్సిక్’కు కలిసొస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ కూడా సినిమాను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’కు మంచి స్థాయిలో థియేటర్లు దక్కనున్నట్లు సమాచారం. తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి బడా పేర్లు ‘టాక్సిక్’ విడుదలలో భాగం కావడంతో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో థియేటర్లను ఆ సినిమాకు కేటాయించే పరిస్థితి ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం ‘ఇరుముడి’ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో దాదాపు 50 శాతం వరకు థియేటర్లు తగ్గే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బుధవారం ‘ఇరుముడి’కి రావాల్సిన సెలవు రోజు కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
సినిమా మంచి రన్లో ఉన్న సమయంలో స్క్రీన్లు తగ్గిపోవడం సహజంగానే కలెక్షన్ల వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సెలవు రోజున అదనపు షోలు, భారీ ఫుట్‌ఫాల్స్‌తో మరింత వసూళ్లు సాధించే అవకాశం ఉండగా, థియేటర్లు తగ్గడం ‘ఇరుముడి’కి పెద్ద స్పీడ్ బ్రేకర్‌గా మారొచ్చు. అయితే ఈ పోటీపై ‘ఇరుముడి’ చిత్రబృందం మాత్రం ధీమాగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు చిత్రాల జానర్లు, టార్గెట్ ఆడియన్స్ వేర్వేరుగా ఉండటం తమకు కలిసొస్తుందని వారు భావిస్తున్నారు. ‘టాక్సిక్’ ప్రధానంగా యూత్, యాక్షన్ సినిమా ప్రేక్షకులను టార్గెట్ చేస్తుంటే, ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొనసాగుతోంది. కాబట్టి ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాను ఎంచుకుని థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లెక్క వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలూ సమాంతరంగా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. గతంలో కూడా భిన్నమైన జానర్లకు చెందిన సినిమాలు ఒకేసారి విడుదలై, తమ తమ ప్రేక్షకుల మద్దతుతో విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి.