Trisha | టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’ మంచి విజయాన్ని సాధించింది. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో తొలి హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీవేదాక్షర మూవీస్ పతాకంపై నిర్మాత చింతపల్లి రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న విడుదల కానుంది. ఓ చిత్రకారుడు, పోలీసు కలిసి ఓ హత్య కేసును ఎలా ఛేదించారన్నదే ఈ సినిమా కథాంశం.
యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని, అలీషా పాత్రలో త్రిష పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. వినయ్ రాయ్, మందిరా బేడీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అఖిల్ జార్జ్, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: అఖిల్ పాల్, అనాస్ఖాన్.