టాలీవుడ్ యువ హీరో ఆదిసాయికుమార్ (Top Gear) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి టాప్ గేర్ (Aadi Saikumar). శశికాంత్ దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. డిసెంబర్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు ఆది సాయికుమార్. సినిమా విశేషాలు ఆది మాటల్లోనే..
సినిమా ఎలా ఉండబోతుంది..?
ఈ సినిమా రేసీ థ్రిల్లర్. డైరెక్టర్ శశికాంత్ రెండు కథలను చెప్పాడు. ఇందులో ఒకటి పొలిటికల్ థ్రిల్లర్. మరో స్టోరీ టాప్ గేర్ నాకు కరెక్ట్‌గా సెటవుతుందనిపించింది. సమస్యల్లో చిక్కుకున్న క్యాబ్ డ్రైవర్ ఎలాంటి పరిస్థితులెదుర్కొన్నాడనేది కథాంశం. ఒక్క రోజులో జరిగే కథే ఈ సినిమా.
టాప్ గేర్ టైటిల్ పెట్టడానికి కారణం..?
షూటింగ్ మొదలయ్యేకంటే ముందు టైటిల్ నిర్ణయించలేదు. కానీ ఈ పేరును సూచించినపుడు టాప్ గేర్ పర్ఫెక్ట్గా సరిపోతుందని చిత్రయూనిట్ అంతా భావించారు. కథలో హీరో పరిస్థితులు డిమాండ్ చేసినపుడు ఖచ్చితంగా టాప్ గేర్ వేయాల్సి ఉంటుంది. అందుకే టాప్ గేర్ టైటిల్ అయితే స్టైలిష్‌గా ఉంటుందని భావించాం.
మాస్ సినిమాలు చేయాలనే ఆలోచన ఉందా..?
కేజీఎఫ్ విడుదలైన తర్వాత మాస్ జోనర్ అర్థం మారిపోయింది. ఈ రోజుల్లో ప్రేక్షకులు రెగ్యులర్ మాస్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. సినిమా లైన్ కానీ, కథనం కానీ కొత్తగా ఉండాలనుకుంటున్నారు. రెగ్యులర్ కథ కాకుండా పవర్ ఫుల్ స్క్రిఫ్ట్‌తో మీ ముందుకొస్తున్నాం.
యాక్షన్ పార్టు గురించి.. ?
పృథ్వి చాలా అద్భుతమైన ఫైట్ మాస్టర్. రొమాంటిక్‌తో మంచి బ్రేక్ అందుకున్నారు. లైన్ ఆధారంగా ఫైట్స్ ను డిజైన్ చేశారు. అందుకే టాప్ గేర్ యాక్షన్ పార్ట్ చాలా సహజంగా ఉండబోతుంది. యాక్షన్ సన్నివేశాలు చాలా కష్టంతో కూడుకున్నవి.. వాటిని షూట్ చేస్తున్నపుడు పృథ్వి సరైన జాగ్రత్తలు తీసుకున్నారు.
విభిన్నమైన సినిమాలను ప్రయత్నించాలని భావిస్తున్నారా..?
యూనిక్ సినిమాలను చేయాలని ఆసక్తిగా ఉంది. టాప్‌గేర్ ఈ కేటగిరీలోకే వస్తుంది. అంతేకాదు మిమ్మల్ని అబ్బురపరిచే ప్రయోగాత్మక ZEE5 వెబ్ సిరీస్ పులి మేక చేస్తున్నా. చాలా మంది దర్శకనిర్మాతలు కమర్షియల్ సబ్జెక్టులతో నా దగ్గరకు వచ్చారు. కానీ నాకు కమర్షియల్ హంగులున్న వాస్తవ కథాంశాలను చేయాలని ఉంది.
మీ కొత్త సినిమాల గురించి..?
లక్కీ మీడియాతో ఓ సినిమా చేస్తున్నా. కథ చాలా బాగుంటుంది. కొత్త డైరెక్టర్ తీయబోతున్నాడు. ఇతర దర్శకులతో కూడా చర్చలు నడుస్తున్నాయి. వెబ్ సిరీస్ పులి మేక షూటింగ్ పూర్తయింది. కోనవెంకట్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను పంతం ఫేం చక్రవర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.
Read Also : Uravasi Rautela | చిరంజీవితో పనిచేస్తున్నానా అని షాకయ్యా : ఊర్వశి రౌటేలా
Read Also : Ranveer Singh | క్రేజీ టాక్.. రవితేజ సినిమాపై కన్నేసిన రణ్వీర్ సింగ్
Read Also : GV Prakash Kumar | సూరారై పోట్రు రీమేక్‌పై జీవీ ప్రకాశ్ కుమార్ అప్డేట్