Sreeleela | టాలీవుడ్లో అందం, అభినయంతోపాటు డ్యాన్స్‌లోనూ ఇరగదీసే అతికొద్ది మంది మోడ్రన్ భామల్లో టాప్‌లో ఉంటుంది శ్రీలీల. అదిరిపోయే గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తూనే.. మరోవైపు యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేయడం ఈ బ్యూటీకున్న ప్రత్యేకత. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది శ్రీలీల. ఈ భామ ప్రస్తుతం రవితేజతో కలిసి మాస్ జాతర సినిమాలో నటిస్తోంది.
ఈ మూవీ అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది శ్రీలీల టీం. కాగా శ్రీలీల కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ భామ ఫీ మేల్ సెంట్రిక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్టు వార్త ఒకటి జోరుగా నడుస్తోంది.
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పూణే సుందరి భాగ్య శ్రీ బోర్సే. శ్రీలీలతోపాటు మరోవైపు ఈ భామ పేరు కూడా వినిపిస్తోంది. మరి వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ ఇద్దరిలో ఎవరితో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందనేది ఆసక్తికంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ సినిమాపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్