Tom Wilkinson | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ నటుడు, పొలిటికల్ లీడర్ విజయకాంత్ మరణం అందరిని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షాక్ నుంచి తేరుకునేలోపే మరో షాక్ తగిలింది. ప్రముఖ బ్రిటిష్ నటుడు బ్యాట్‌మ్యాన్ సినిమా ఫేమ్ టామ్ విల్కిన్సన్ (Tom Wilkinson) కన్నుమూశారు. 75 ఏళ్ల విల్కిన్సన్ అనారోగ్యంతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక విల్కిన్సన్ మరణ వార్తతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1976 వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ స్ముకా అనే సినిమాతో టామ్ విల్కిన్సన్ హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తన 50 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించాడు. మరోవైపు విల్కిన్సన్ రెండుసార్లు ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు.