Tom Cruise Oscar Award | సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్‌ని వరించనుంది. నవంబర్ 16న లాస్ ఏంజిల్స్‌లో జరిగే 2025 గవర్నర్స్ అవార్డ్స్‌లో టామ్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. టామ్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డాలీ పార్టన్, డెబీ అలెన్, విన్ థామస్‌కు కూడా ఈ గౌరవ పురస్కారాన్ని అందుకుంటారని అకాడమీ ప్రకటించింది. సినిమా రంగంలో టామ్ క్రూజ్ చేసిన అద్భుతమైన కృషికి, మరియు స్టంట్స్ కమ్యూనిటీకి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించనుంది.
టామ్ క్రూజ్ ఇప్పటివరకు నాలుగు సార్లు ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అవ్వగా.. ఒక్కసారి కూడా అవార్డు వరించలేదు. మరోవైపు ఇటీవల వచ్చిన మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రికనింగ్ షూటింగ్లో అత్యధిక బర్నింగ్ పారాచూట్ జంప్‌లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.
Read More