Producer Kedar | టాలీవుడ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు. దుబాయిలో ఆయన మంగళవారం మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’ మూవీని కేదార్ నిర్మించారు. ఆయన ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, నిర్మాత బన్సీ వాసు, ఆనంద్ దేవరకొండకు సన్నిహితుగా తెలుస్తున్నది. బన్నీ వాసు ప్రోద్బలంతోనే ఆయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలోనూ ముత్తయ్య అనే సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయనున్నారు. ఆ మూవీ సైతం కేదార్ బ్యానర్లో తెరకెక్కాల్సి ఉంది. దర్శకుడు సుకుమార్‌కు సైతం అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. తాజాగా ఆయన కన్నుమూశారన్న వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. కేదార్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? దుబాయికి ఎందుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.