మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 17:07:45

బాల‌కృష్ణ‌తో యువ ద‌ర్శ‌కుడి సినిమా..!

బాల‌కృష్ణ‌తో యువ ద‌ర్శ‌కుడి సినిమా..!

స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం మంచి హిట్ కొట్టిన త‌ర్వాత యువ ద‌ర్శ‌కుడు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి కొత్త ప్రాజెక్టు ప్ర‌క‌టించ‌ని సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అనిల్ రావ‌పూడి ఎఫ్2 సీక్వెల్ కు క‌థ‌ను సిద్దం చేసే ప‌నిలో ఉన్నాడు. ఎఫ్3 కోసం క‌థ రెడీ చేసిన త‌ర్వాత అనిల్ రావిపూడి నంద‌మూరి హీరోను డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ నంద‌మూరి హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఇంకెవ‌రు బాల‌కృష్ణ.

అనిల్ రావిపూడి ఇప్ప‌టికే బాల‌య్య‌కు ఓ స్టోరీలైన్ ను వినిపించాడని, బాల‌కృష్ణ గ్రీన్ సిగ్న‌ల్ కోసం వెయిట్ చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. అన్నీ కుదిర‌తే బాల‌కృష్ణ‌, అనిల్‌రావిపూడి వంటి అరుదైన కాంబినేష‌న్ ను తెర‌పై చూడొచ్చ‌న్న‌మాట‌. ద‌స‌రా సీజ‌న్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. త‌న సినిమాల్లో వినోదానికి పెద్ద పీట వేసే అనిల్ రావిపూడి మ‌రి బాల‌కృష్ణ‌లోని కామెడీ ట‌చ్ ను ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo