Acharya | ‘ఆచార్య’ ఫ్లాప్ అవడానికి కారణాలు ఇవే :పరుచూరి గోపాలకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని, అసలు ఈ చిత్రాన్ని కొరటాల శివనే దర్శకత్వం వహించాడా, ఆయన డైలాగ్స్, ఎలివేషన్స్ ఏ మాత్రం సినిమాలో కనిపించలేదని అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం కూడా మైనస్ అని ప్రేక్షకుల అభిప్రాయం. రెండు మూడు పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయని తెలిపారు. కాగా తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ చిత్రాన్ని పరుచూరి రీసెంట్గా చూశానని అందుకే ఇప్పుడు ఆచార్య గురించి మాట్లాడుతున్నానని తెలిపాడు. ఈ చిత్రాన్ని చూసేటప్పుడు ఎన్నో ఏళ్ళ క్రీతమే మేము రాసిన ‘మరో మలుపు’ అనే చిత్రం తమకు గుర్తుకు వస్తోందని తెలిపాడు. ఈ చిత్రంలో కూడా ఆలయాల దోపిడి నక్సలైట్‌గా శివకృష్ణ నటించాడని, ఇక ఆచార్య చిత్రంలో కూడా పాదఘట్టం, ధర్మస్థలి జీవనధార సాక్షీగా ఈ సినిమా కథ నడుస్తుంది. 1990ల్లో ఎక్కువగా నక్సలిజం సినిమాలు వచ్చాయని ఇప్పుడు ఇలాంటి కథలను రాయడం పూర్తిగా మానేశామని తెలిపాడు. చాలా ఏళ్ళ తర్వాత కొరటాల ఇలాంటి సినిమా తెరకెక్కించడం చాలా గొప్ప విషయమని తెలిపాడు.
అయితే ఈ సినిమా తెరకెక్కించేటప్పుడు ఎందుకు జరిగింది? ఏం జరిగింది? అనే విషయాన్ని తెలియకుండానే కథను చూపించారు. దీంతో ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. ఆ ప్రభావం సినిమా పైన చాలా పడింది. అందువల్లే ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది అని తెలిపారు. ఇక రామ్‌చరణ్ పాత్రను మొదటి భాగంలో అక్కడక్కడ చూపించి ఉంటే బాగుండేది, కానీ సెకండ్ హాఫ్ వరకు దాచేయడం వలన ఈ సినిమా సరిగ్గా ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ నటించకపోయుంటే బాగుండేదని తెలిపాడు. ఒక పనిచేయడానికి ఇద్దరు స్టార్లు అవసరం లేదని తన అభిప్రాయం అని పరుచూరి తెలిపాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ వారికి నక్సలైట్ కి సంబంధించిన సినిమాలు ఎక్కడం లేదు. దీనవల్లే ఈ సినిమా ప్లాప్ కి కారణమని చెప్పవచ్చు అని తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

