Tollywood Stars | ఒకప్పుడు హీరోలు ఎండలు, వానలని, చలిని కూడా లెక్క చేయకుండా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్టార్ హీరోల సినిమాలు అయితే ఏడాదికి ఒక్కటి రావడమే గగనం అయింది.భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో ప్రతి చిత్రానికి సమయం తీసుకుంటున్నారు. అయితే కొందరు హీరోలు మాత్రం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి మండే ఎండల్లోను షూటింగ్స్ చేస్తూ తమ సినిమాలని వీలైనంత త్వరగా థియేటర్స్‌లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఇప్పుడు అజీజ్‌నగర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అఖండ 2 కోసం ఆర్ఎఫ్సీలో వేసిన సెట్లో షూటింగ్ చేస్తున్నారు నందమూరి నటసింహం. ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. భాను భోగవరపు సినిమా కోసం జాన్వాడలో షూటింగ్‌తో బిజీగా ఉన్నారు మాస్ మహరాజ్ రవితేజ. సాయి ధరమ్ తేజ్ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది.
తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న మిరాయ్ మూవీ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా షూటింగ్ బాచు పల్లిలో జరుగుతుంది. నీరజా కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అఖిల్ హీరోగా మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. ఇలా పలు చిత్రాలు వివిధ ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎండలని సైతం లెక్క చేయకుండా ఈ హీరోలు సినిమా షూటింగ్స్ పూర్తి చేసి వీలైనంత త్వరగా తమ సినిమాలని థియేటర్స్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.