టాలీవుడ్ (Tollywood) నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను పలువురు సినీ నిర్మాతలు కలిశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఇటీవలే చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు పొలిటికల్ గా సెటైర్లు వేస్తూనే సినిమా ఇండస్ట్రీ సమస్యలను లేవెనెత్తుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు పవన్. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే దిల్ రాజు నేతృత్వంలో పలువురు నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి పవన్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), డీవీవీ దానయ్య ( DVV Danayya), మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యేర్నేని, యూవీ క్రియేషన్స్ వంశీ రెడ్డి, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఇతర నిర్మాతలు పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలో కలిశారు.
సినీ పరిశ్రమలోని పలు సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకునే విషయమై నిర్మాతలు పవన్ కల్యాణ్ తో చర్చించినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా గురువారం సినీ నిర్మాత అల్లు అరవింద్ ఏపీ సీఎం జగన్ (AP CM Jagan Reddy)ను కలిసి సినీ పరిశ్రమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ గార్ని ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య,నవీన్ ఎర్నేని,వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి @PawanKalyan pic.twitter.com/EUzLxKiJhY
— BA Raju's Team (@baraju_SuperHit) October 1, 2021
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
ఉత్తేజ్ భార్య సంతాప సభలో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన