తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) బుధవారం ఉదయం హఠాన్మరణం చెందారు. నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘కేడి’ చిత్రానికి కిరణ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం ద్వారా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
అంతకు పూర్వం ఆయన పలు చిత్రాలకు రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కేజేక్యూ: కింగ్..జాకీ..క్వీన్’ షూటింగ్‌ను పూర్తిచేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో దర్శకుడు మరణించడంతో చిత్రయూనిట్ విచారం వ్యక్తం చేసింది. దర్శకుడు కిరణ్‌కుమార్ మృతికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.