‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్‌సిరీస్‌తో అగ్ర కథానాయిక తమన్నా పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. వరుస ఇంటర్వ్యూల్లో ఈ భామ చెబుతున్న విషయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ భామ తెలుగు హీరోలను ఆకాశానికెత్తింది. వాళ్లంత మంచోళ్లు ఏ భాషా పరిశ్రమలో కూడా కనిపించరని పొగడ్తలు కురిపించింది. ఆమె మట్లాడుతూ ‘టాలీవుడ్ హీరోలు కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యతనిస్తారు.
మహిళల పట్ల ఎంతో గౌరవంతో ఉంటారు. షూటింగ్ సమయంలో ఎలాంటి ఈగో సమస్యలు లేకుండా వ్యవహరిస్తారు. ఇతర భాషల హీరోలతో పోల్చితే తెలుగు హీరోలు చాలా సౌమ్యులని చెప్పొచ్చు. వాళ్లని చూసిన తర్వాత అబ్బాయిలపై నా అభిప్రాయం మొత్తం మారిపోయింది’ అంటూ ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదిన రజనీకాంత్ ‘జైలర్’, చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. ఆమె నటించిన తాజా సిరీస్ ‘లస్ట్‌స్టోరీస్-2’ పై వివాదాలు తలెత్తినా..ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంటున్నది.