ప్రతీ విషయాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూసే సెలబ్రిటీ రాంగోపాల్ వర్మ ( Ram Gopal Varma). ఏదో ఒక ట్వీట్, కామెంట్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలవడం వర్మ స్టైల్. ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు తమ స్నేహితులతో ఈ స్పెషల్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ వర్మ డిఫరెంట్ కదా..ఈ క్రేజీ కాంట్రవర్సియల్ డైరెక్టర్ మాత్రం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన శత్రువులను గుర్తు చేసుకుంటూ.. వేడుక చేసుకుంటున్నాడు. అంతేకాదు ఫ్రెండ్ షిప్ డేను ఎనిమీషిప్ డే ( Enemyship Day ) గా మార్చేశాడు వర్మ. స్నేహితులను కలిగి ఉన్నపుడు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను గుర్తు చేస్తూ శత్రువులను గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు స్నేహితుల కంటే శత్రువులు ఎంత బెటరో.. హ్యాపీ ఎనిమీషిప్ డే స్పెషాలిటీ ఏంటో కొన్ని ట్వీట్ల ద్వారా చెప్పాడు వర్మ.
స్నేహితుడికి సహాయం చేయడం వెనుకున్న సమస్య ఏంటంటే..మళ్లీసారి అతనికి సాయం కావాలన్నపుడు మీ దగ్గరికే వస్తాడు. అతడు మళ్లీ మీ వద్దకు హ్యాపీ ఎనిమీషిప్ డే తో వస్తాడు. కానీ శత్రువులు మాత్రం స్నేహితుల్లాగా హ్యాపీ ఎనిమీషిప్ డేతో వచ్చి మీకు ద్రోహం చేయలేరని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
శత్రువులు మిమ్మల్ని ఎదుర్కొంటారు కాబట్టి వాళ్లు చాలా ధైర్యవంతులు. నమ్మక ద్రోహం చేసే స్నేహితులతో చాలా ప్రమాదం. కానీ శత్రువులతో అలాంటి ప్రమాదం ఉండదని చెప్పాడు వర్మ.
స్నేహితుడు హ్యాపీ ఎనిమీస్ డే ను చోరీ చేసినపుడు శత్రువు దోపిడీ చేస్తాడని ట్వీట్ చేశాడు.
స్నేహితులు వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తారు. కానీ శత్రువులు మీ బలాల్నిసీరియస్ గా తీసుకుంటే.. స్నేహితులు మాత్రం మీరు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయేలా చేసి..వారి బలంగా మార్చుకుంటారు.
అంతేకాదు మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు వర్మ. ఒకరి భార్య తన ప్రాణ స్నేహితుడితో పారిపోయే అవకాశం ఉంది. కానీ శత్రువు విషయంలో ఇది చాలా అరుదైన విషయమని ట్వీట్ చేశాడు వర్మ.
మొత్తానికి అందరూ చాలా హ్యాపీగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుంటే..వర్మ మాత్రం ఆ స్నేహితుల్లో మంచి వారెవరు, చెడ్డ వారుంటే వచ్చే నష్టాలేంటి. శత్రువుల వల్ల కలిగే ప్రయోజనాలేంటదనేది తనదైన స్టైల్ లో ట్వీట్ల వర్షంతో అందరికీ అర్థమయ్యేలా చెప్పాడ
The problem with helping a friend is, next time he needs help, he will again come to u only😳 #HappyEnemyshipDay
— Ram Gopal Varma (@RGVzoomin) August 1, 2021
Good thing about enemies is that they can’t betray you like how friends do 😳#HappyEnemyshipDay
— Ram Gopal Varma (@RGVzoomin) August 1, 2021
Enemies are more courageous because they face you unlike cowardly friends who backstab you 😳#HappyEnemyshipDay
— Ram Gopal Varma (@RGVzoomin) August 1, 2021
An enemy robs while a friend steals 😳#HappyEnemiesDay
— Ram Gopal Varma (@RGVzoomin) August 1, 2021
Enemies take ur strengths seriously and friends make u lose ur confidence in those strengths😳 HappyEnemyshipDay
— Ram Gopal Varma (@RGVzoomin) August 1, 2021
Chances of ur wife running away with ur best friend are more than running away with ur best enemy 😳 #HappyEnemyshipDay
— Ram Gopal Varma (@RGVzoomin) August 1, 2021
ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..