Raghu Karumanchi | కొత్త బిజినెస్‌లోకి కమెడియన్ రఘు..వైరల్ అవుతున్న వీడియో
కోవిడ్ ఎఫెక్ట్‌తో సరైన అవకాశాలు లేకపోవడంతో కెరీర్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడు టాలీవుడ్ (Tollywood) కమెడియన్ రఘు కరుమంచి (Raghu Karumanchi).

నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో డిఫరెంట్ స్టైల్లో కామెడీ పండించే యాక్టర్లు కొందరే ఉంటారు. అలాంటి జాబితాలోనే వస్తాడు టాలీవుడ్ (Tollywood) కమెడియన్ రఘు కరుమంచి (Raghu Karumanchi). అదుర్స్, పవర్ చిత్రాల్లో తన కామెడీ స్టైల్లో అందరినీ నవ్వించాడు. వీటితోపాటు చాలా చిత్రాల్లో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని అందించాడు. అయితే కోవిడ్ ఎఫెక్ట్‌తో సరైన అవకాశాలు లేకపోవడంతో కెరీర్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడు.
హైదరాబాద్ సరిహద్దుల్లో తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. ఇపుడు తాజాగా లిక్కర్ వ్యాపారి (liquor business)గా మారిపోయాడీ సీనియర్ కమెడియన్. లిక్కర్ షాపు నిర్వహిస్తున్న తన స్నేహితులు సాయిరామ్ రెడ్డి, హరినాథ్‌లను సంప్రదించాడు.ఇటీవలే జరిగిన కొత్త మద్యం షాపుల వేలంపాటలో రఘు, సాయిరామ్ రెడ్డి, హరినాథ్ రెండు షాపులు దక్కించుకున్నారు.
అభినవ్ లిక్కర్స్ 1&2 పేరుతో నల్లగొండ జిల్లా సరిహద్దులోని మర్రిగూడ బైపాస్ దగ్గర ఈ మద్యం షాపులను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 1న ఈ షాపులను ప్రారంభించారు. రఘు కస్టమర్ల టోకెన్ కౌంటర్ దగ్గర మద్యం సీసాలు బయటపెడుతుండగా తీసిన ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తన కొత్త వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్థిల్లాలని దీవించాలని అందరినీ కోరుతున్నాడు రఘు. మొత్తానికి సినిమా రంగంలో అవకాశాలు లేవని బాధపడే వారికి ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కొని ఎంతోమంది కోస్టార్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రఘు. ఆయన బిజినెస్ మంచిగా డబ్బులు తెచ్చిపెట్టాలని అందరూ విష్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

