Samantha : నా ఆశలన్నీ అడియాశలయ్యాయి.. మరోసారి విడాకులపై స్పందించిన సమంత
మరోసారి విడాకులపై స్పందించిన సమంత | టాలీవుడ్ నటి సమంత మరోసారి తన వ్యక్తిగత జీవితంపై స్పందించింది. ఇప్పటికే తను ఫిలింఫేర్ ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత తాను చనిపోతానేమో
టాలీవుడ్ నటి సమంత మరోసారి తన వ్యక్తిగత జీవితంపై స్పందించింది. ఇప్పటికే తను ఫిలింఫేర్ ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత తాను చనిపోతానేమో అని.. మానసికంగా కుంగిపోతానేమని భయపడ్డానని.. కానీ.. తనలో ఉన్న ధైర్యం తనను చావనీయలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మరో ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ముఖ్యంగా తనపై కొందరు అసభ్య కామెంట్లు పెడుతున్నారని.. అటువంటి అసభ్య కామెంట్లు పెట్టేవారు.. తన అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుందని.. ఏది పడితే అది రాయడం కరెక్ట్ కాదని సమంత చెప్పుకొచ్చింది.
ఎన్నో ఏళ్లు కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నా. ఈ ఏడాది నా వ్యక్తిగత జీవితానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నా ఆశలన్నీ శిథిలమైపోయాయి. కాలం నా కోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తా. నాపై కొందరు అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. అసభ్య కామెంట్లు పెట్టేవారిని నేను ఒక్కటే కోరుతున్నా. నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుంది… అంటూ సమంత ఇంటర్వ్యూలో తెలిపింది.
యథార్థాన్ని అంగీకరించాలి. అప్పుడు మనం విజయం సాధించినట్లే. జీవితం ఎప్పటికీ ముగియని ఓ యుద్ధమని భావిస్తే ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. జీవితానికి ఎదురీది పోరాడాల్సిందే. తొలుత నేను చాలా బలహీనురాలినని అనుకునేదాన్ని. కానీ జీవితంలోని కష్టాల్ని ఎదుర్కొన్నప్పుడే నాలోని బలాలేమిటో, నా శక్తిసామర్థ్యాలేమిటో తెలిసొచ్చాయి’ అని అంతకుముందు ఇంటర్వ్యూలో సమంత తన విడాకుల గురించి తెలిపింది.
మరోవైపు సమంత ప్రస్తుతం భారీ చిత్రాలపై దృష్టి పెడుతూ కెరీర్లో దూసుకుపోతోంది. ఇటీవలే పాన్ఇండియా చిత్రం ‘యశోద’ సెట్స్ మీదకు వెళ్లింది. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha | అప్పుడు నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు : సమంత సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi: ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై చిరంజీవి స్టన్నింగ్ రియాక్షన్
రామ్ చరణ్, మహేశ్ బాబు కాంబినేషన్లో మల్టీస్టారర్
Katrina Kaif: కాబోయే పెళ్లి కూతురు ఎంత క్యూట్‌గా మెరిసిపోతుంది..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

