Rashi Khanna | రుద్ర ‘ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’ వెబ్ సిరీస్‌లో డాక్టర్ ఆలియా చోక్సీ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నది దక్షిణాది నటి రాశీఖన్నా. ఇప్పుడు ఫర్జీ అనే సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నది. నకిలీ నోట్లు పసిగట్టే ఆఫీసర్‌గా నటిస్తున్న రాశి.. తన మనసులోని అసలైన విషయాలు పంచుకుంది.
ఫర్జీ సిరీస్ ఒప్పుకోవడానికి కారణమేంటి?
ఫ్యామిలీమ్యాన్ సిరీస్ చూసినప్పటి నుంచి నేను దర్శకులు రాజ్, డీకేలకు వీరాభిమానిగా మారిపోయా. లాంగ్‌ఫార్మాట్‌లో ఎక్కడా బోర్ కొట్టకుండా సిరీస్‌లు తీయడంలో వారు సిద్ధహస్తులు. అందుకే వారు కథ చెప్పగానే నో చెప్పడానికి నాకు కారణాలు కనిపించలేదు. ఇంకా విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో చేస్తున్నారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే వెంటనే ఒప్పేసుకున్నా.
ఫర్జీ కోసం ఎలా కష్టపడ్డారు?
ఈ సిరీస్‌లో మేఘ అనే ప్రభుత్వ అధికారి పాత్రలో నటించాను. ఇది చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఈరోజుల్లో కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగాలంటే కష్టమైన టాస్క్‌లు చేయాలి. అందుకే.. ఈ సిరీస్ కోసం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. ఆర్థిక లావాదేవీలు, నకిలీ కరెన్సీ వంటి అంశాల్లో చాలా విషయాలు తెలిశాయి.
వెబ్ సిరీస్ గురించి ఏం చెప్తారు?
వెబ్‌సిరీస్‌కు, సినిమాకు చాలా తేడా ఉంటుంది. సిరీస్‌లలో పాత్రలను చాలా వివరంగా చూపించేందుకు స్కోప్ ఉంటుంది. పాత్రల నిడివి కూడా ఎక్కువే. ఫర్జీలో చేసేటప్పుడు వరుసగా 16 రోజులపాటు మేఘ పాత్రను షూట్ చేశారు. ఆ తర్వాత నేను ఆ పాత్రలోంచి బయటికి రావడానికి రెండుమూడు రోజులు పట్టింది.
మీలోని సింగర్ కెరీర్ ఎంతవరకు వచ్చింది?
ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే ఉంది. కానీ, మనసులో మాత్రం పాడాలనే కోరిక బలంగా ఉంది. గతంలో తెలుగులో ఓ పాట పాడాను. హిందీలో కూడా పాడాలని ఉంది. సరైన అవకాశం వస్తే తప్పకుండా నాలోని గాయనిని మీ అందరికీ పరిచయం చేస్తాను.
తొమ్మిదేండ్ల కెరీర్లో మీ అనుభవాలు..
నటించడం అంటే రకరకాల పాత్రల్లో జీవించడం. మనల్ని మనం సరిగ్గా అంచనా వేసుకోగలిగితే.. పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఎలాంటి పాత్రలో అయినా లీనమై ప్రేక్షకులను మెప్పించొచ్చు. తొమ్మిదేండ్ల కెరీర్లో ఒక ఆర్టిస్టుగా ప్రతి ఒక్కరినుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటున్నాను.
> రియల్ లైఫ్‌లో నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను.ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాను. నేను సాధించిన విజయాలను తలలోకి ఎక్కించుకోలేదు.
> ఫ్యాషన్ కంటే కంఫర్ట్ ముఖ్యం అని నా ఫీలింగ్. నా మూడ్‌ని బట్టి పైజమా ఎక్కువగా ధరిస్తా. నగలు వేసుకోవడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. చూసేవారికి, నాకు ఇబ్బంది అనిపించకుండా ఉండే దుస్తులను ఎంచుకుంటాను.
> వారంలో ఐదు రోజులు వ్యాయామం చేస్తాను. సింపుల్ డైట్ ఫాలో అవుతాను. యోగా, ధ్యానం చేస్తా. కిక్ బాక్సింగ్ చేస్తుంటా. ఇంతకంటే పెద్దగా ఏం చేయను.
మరిన్ని ఫొటోల కోసం: Rashi Khanna | రాశి ఖన్నా అల్ట్రా స్టైలిష్ ఫొటోషూట్..