ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు. సెలబ్రిటీల విషయానికొస్తే మాత్రం ఫిట్నెస్, ఆరోగ్యంపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. గ్లామరస్ గా కనిపించేందుకు రెగ్యులర్ గా జిమ్ సెషన్ ఉండేలా చూసుకుంటారు. పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) కూడా ఇదే మంత్రను ఫాలో అవుతుంది. జిమ్ కు వెళ్లిన పూజాహెగ్గే చెమటోడుస్తూ తెగ కష్టపడుతోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్స్ ను చూస్తే పూజా వర్కవుట్ (workout) ఏ రేంజ్ లో ఉందో మీకే అర్థమవుతుంది.
గ్రే టీ షర్ట్, రెడ్ జిమ్ ప్యాంట్స్ వేసుకున్న పూజాహెగ్డే తన జిమ్ ట్రైనర్ తో కలిసి వర్కవుట్ చేసింది. మీరు మీ శరీరాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు.. అది చల్లగా కనిపిస్తుంది..అంటూ వీడియో క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా..స్టిల్ ఫొటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. వివిధ రకాల కెమెరాలను చేతిలో పట్టుకుని దిగిన స్టిల్స్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
ఎల్లప్పుడూ నా వెనకే ఉండి నన్ను కెమెరాలో బంధించే రాక్ స్టార్ ఫొటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు..అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పూజాహెగ్డే ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ లో నటించగా..వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. మరోవైపు అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, విజయ్ తో బీస్ట్ చిత్రాల్లో నటిస్తోంది.
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!