Eesha Rebba | ‘అరవింద సమేత’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఈషా రెబ్బా. సినిమాలే కాదు ఆమె నటించిన త్రీ రోజెస్, ‘దయా’ వెబ్ సిరీస్‌లు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం హీరో సుధీర్ బాబు సరసన ఆమె హీరోయిన్గా నటించిన ‘మామ మశ్చీంద్ర’ సినిమా విడుదలకు సిద్దమయ్యింది. ‘మామ మశ్చీంద్ర’ లో తాను సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా కనిపిస్తానని చెప్పింది ఈషా రెబ్బా.
”ఇందులో నా పాత్ర పేరు వైరల్ విశాలాక్షి. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చేస్తుంటాను. చాలా హైపర్‌గా ఉంటాను. వైరల్ వీడియోలు చేయడం అంత తేలిక కాదు. ఈ పాత్ర చేస్తున్నపుడు సోషల్ మీడియాలో వీడియోలు చేసేవారి కష్టం తెలిసింది” అని చెప్ప్పుకొచ్చింది ఈషా. ‘మామ మాశ్చీంద్ర’లో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నటుడు రచయిత హర్షవర్ధన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.