శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 13:23:38

తెలుగు సినిమాతో ' బొమ్మరిల్లు ' హీరో రీఎంట్రీ

తెలుగు సినిమాతో ' బొమ్మరిల్లు ' హీరో రీఎంట్రీ

బాయ్స్, బొమ్మ‌రిల్లు, చుక్క‌ల్లో చంద్రుడు, నువ్వొస్తానంటే వంటి చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్దార్థ్‌. ఎన్టీఆర్ న‌టించిన బాద్ షా (2013)చిత్రంలో గెస్ట్ రోల్ లో క‌నిపించిన సిద్దార్థ్ ఆ త‌ర్వాత మ‌రే తెలుగు చిత్రంలో క‌నిపించ‌లేదు. కేవ‌లం త‌మిళ సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టాడు. సుదీర్ఘ విరామం త‌ర్వాత సిద్దార్థ్ మ‌ళ్లీ తెలుగు ప్రేక్షకుల‌ను ప‌లుక‌రించేందుకు సిద్ద‌మవుతున్నాడు.

ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి మ‌హాస‌ముద్రం టైటిల్ తో సినిమాను తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల్టీస్టార‌ర్ గా రానున్న ఈ మూవీలో శర్వానంద్ ఓ హీరోగా క‌నిపించ‌నుండ‌గా..మ‌రో హీరోగా సిద్దార్థ్ న‌టించ‌నున్నాడు. అజ‌య్ భూప‌తి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేసేందుకు సిద్దార్థ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత అజ‌య్ భూప‌తి మ‌హా స‌ముద్రం ప్రాజెక్టుపై భారీగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. లవ్ యాక్ష‌న్ డ్రామాగా రానున్న ఈ మూవీని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo