Ram Charan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) ఏపీలోని కడపలో జరుగనున్న 80వ దర్గా నేషనల్ ముషైరా ఘజల్ ఈవెంట్‌కు రాంచరణ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో కడపలో సందడి చేశాడు. అంతకు ముందు రాంచరణ్‌కు అభిమానులు భారీ గజమాలతో వెల్ కమ్ చెప్పారు. అభిమానుల విజ్ఞప్తి మేరకు బిల్డప్ సర్కిల్లోని శ్రీశ్రీ విజయ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నాడు.
అమ్మవారికి పూర్ణకుంబాభిషేకం నిర్వహించారు. రాంచరణ్ కొత్త సినిమా స్క్రిప్ట్‌కు పూజలు చేయించాడు. ఈ సందర్భంగా అమీన్ పూర్ దర్గాను సందర్శించాడు. కడప దర్గా అధికారులు రాంచరణ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. రాంచరణ్‌ను చూసేందుకు కడప ఎయిర్‌పోర్టు నుంచి దర్గా మార్గం వెంబడి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రాంచరణ్ కడప సందర్శనకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. చివరి షెడ్యూల్ పూర్తయ్యే దశలో ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
రాంచరణ్‌కు ఘనస్వాగతం ఇలా..
On fans Request #GlobalStar @AlwaysRamCharan garu visited a famous durgamma temple in kadapa and offered Poornakumbabishekam to Ammavaru 💥💥💥💥💥💥#RamCharanStormInKadapa pic.twitter.com/YPen7vwOGi
— SivaCherry (@sivacherry9) November 18, 2024
Kadapa Dargah officials welcome our #GlobalStar @AlwaysRamCharan swami 💥🔥🙌🏻 #RamCharanStormInKadapa pic.twitter.com/eJC8RnoRNM
— SivaCherry (@sivacherry9) November 18, 2024
Kannappa | మహదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు.. కన్నప్ప ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది