ఫలక్ నుమా దాస్ తర్వాత టాలీవుడ్ హీరో (Tollywood) విశ్వక్ సేన్ (Vishwak Sen) రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత హిట్ సినిమా కూడా హిట్ కావడంతో ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మీడియం బడ్జెట్ సినిమాలకు విశ్వక్ కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. చేతినిండా సినిమాలతో బిజీ అయ్యాడు ఈయన. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్. అందులో దిల్ రాజు నిర్మాణంలోనే రెండు సినిమాలు చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే పాగల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఓ మై కాదవులే సినిమా రీమేక్ కూడా చేస్తున్నాడు విశ్వక్. పివిపి, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఒరిజినల్ తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు ఇక్కడ కూడా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రితికాసింగ్, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. చిన్నప్పటి నుంచి స్నేహితులైన ఓ జంట.. ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి తర్వాత వాళ్ళ మధ్య మనస్పర్థలు వస్తాయి. అక్కడ్నుంచి సమస్యలు మొదలవుతాయి. అలాంటి సమయంలో వాళ్లు విడిపోతారా.. కలిసుంటారా.. కలిసుంటే వాళ్ల సమస్యకు ఎక్కడ పరిష్కారం దొరికింది అనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అశ్వత్.
ఈ సినిమా రీమేక్ లో విశ్వక్ సేన్ నటిస్తుండటంతో కాస్త మార్పులు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఒరిజినల్ లో హీరో హీరోయిన్ల కథను మరొకరికి చెప్పే పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించాడు. ఇప్పుడు ఇదే పాత్రను తెలుగులో అల్లు అర్జున్ (Allu Arjun)తో చేయిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. దిల్ రాజు ఉండటంతో బన్నీ కూడా దీనికి ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక..నిజంగానే విశ్వక్ సేన్, బన్నీ కాంబినేషన్ సెట్ అవుతుందేమో..?
ఇవి కూడా చదవండి..
Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?