రవియాదవ్, ఉష నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి ఏమైంది’. టి.రాము దర్శకుడు. ఆర్ రవికుమార్ యాదవ్ నిర్మాత. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ కథాంశంతో సాగే హారర్ చిత్రమిది. నవ్విస్తూనే భయపెడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతున్నాం. తదుపరి షెడ్యూల్‌ను డిసెంబర్లో చిత్తూరు జిల్లాలో ప్రారంభిస్తాం’ అని తెలిపారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. నాగమణి, ప్రవీణ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: పి.వి నారాయణ.