మనోశారీరక శక్తుల్ని అనుసంధానిస్తూ మహోన్నత జీవనానికి సాధనంగా యోగాను అభివర్ణిస్తారు. అనాదిగా భారతీయ సాంస్కృతిక, ధార్మిక జీవితంలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యప్రదాయినిగా భాసిల్లుతోంది. సినీ తారల్లో అత్యధికులు యోగాను ఆచరిస్తారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక సమతుల్యానికి యోగాను మించిన సాధనం లేదని చెబుతుంటారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు సినీ తారలు యోగా అవశ్యకతను తెలియజేస్తూ సోషల్మీడియాలో ఫొటోల్ని పంచుకున్నారు. ఆ దృశ్యమాలిక ఇది…