బాలీవుడ్లో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇరగదీసే యాక్లర్లకు కొదవలేదనే విషయం తెలిసిందే. ఈ జాబితాలో టాప్‌లో ఉంటాడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff). సినిమా సినిమాకు స్టన్నింగ్ బాడీ లుక్‌తో అదరగొట్టే ఈ యువ నటుడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. టైగర్ ష్రాఫ్ తరచుగా ఓ అందాల భామతో చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బికినీ షూట్లతో నెట్టింటిని షేక్ చేసే దిశాపటానీ. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ( Disha Patani) డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా ఇపుడు మరో హాట్ టాపిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ యువ హీరో మరో మోడల్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ (Dating rumours) పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఆ భామ ఎవరనే కదా మీ డౌటు.
కొత్త మోడల్ ఆకాంక్ష శర్మ. మహేశ్ బాబు నటించిన సంతూర్ యాడ్‌లో మెరిసింది ఆకాంక్ష శర్మ (Akanksha Sharma). ఈ బ్యూటీ అందాలకు టీవీ ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయిపోతున్నారు. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఆకాంక్ష శర్మ. ఇంతకీ టైగర్ ష్రాఫ్‌కు ఆకాంక్ష శర్మకు మధ్య బాండింగ్ ఎక్కడ కుదిరింది..ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమేనా..? కాదా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
Read Also : Kaala Bhairava | టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కాలభైరవ..!
Read Also : Mahesh Stylish look | మహేశ్ బాబు కొత్త లుక్..ఆ సినిమా కోసమేనా..!