లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ..తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు యువ మ్యూజిక్ కంపోజర్ కాలభైరవ (Kaala Bhairava). ఈ సంగీత దర్శకుడు తాజాగా మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన కార్తికేయ 2(Karthikeya 2)తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాడు. నిఖిల్ సిద్దార్థ్ నటించిన ఈ చిత్రాన్ని కాలభైరవ అందించిన బీజీఎం స్కోర్ (BGM Score)మరో స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు సినీ జనాలు.
తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షో పడిన తర్వాత కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సాగే కథకు కాలభైరవ స్కోర్ బ్యాక్ బోన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ హైదరాబాద్‌లో కాలభైరవ అంకుల్ ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli), తండ్రి కీరవాణి (MM Keeravani) కార్తికేయ 2ను వీక్షించారు. సినిమాకు అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన కాలభైరవను హ్యాపీ మూడ్‌లో హగ్ చేసుకున్నారు. ఇపుడీ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
కాలభైరవ సంగీతం అందించిన కలర్‌ఫొటో ఇటీవలే నేషనల్ అవార్డు సైతం అందుకుంది. ప్రస్తుతం డజన్‌కుపైగా సినిమాలు కాలభైరవ ఖాతాలో ఉన్నాయి. రాబోయే కాలంలో తండ్రికి గట్టి పోటీనివ్వడం ఖాయమని అనుకుంటున్నారు మ్యూజిక్ లవర్స్.
Read Also : Mahesh Stylish look | మహేశ్ బాబు కొత్త లుక్..ఆ సినిమా కోసమేనా..!
Read Also : Tiger Shroff | క్రేజీ టాక్..మరో భామతో డేటింగ్లో యువ హీరో..!