బాలీవుడ్లో యాక్షన్ హీరోలుగా పేరు పొందిన సంజయ్‌దత్, టైగర్‌ష్రాఫ్ కలిసి ఓ యాక్షన్ కామెడీ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకు ‘మాస్టర్ బ్లాస్టర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫిరోజ్ నడియావాలా నిర్మాత. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. హాంకాంగ్, చైనా, లాస్ ఏంజెల్స్‌లోని అరుదైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపనున్నారు.
భారీ యాక్షన్ ఘట్టాలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని నిర్మాత తెలిపారు. ‘ఈ సినిమా కోసం సంజయ్‌దత్, టైగర్‌ష్రాఫ్ చైనీయుల ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకోబోతున్నారు. ఇందుకోసం చైనాకు చెందిన సుశిక్షుతులైన బౌద్ధ్ద గురువులను రప్పిస్తున్నాం. ఈ సినిమా దర్శకుడి పేరును త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది.