Tiger Nageswara Rao | టైగర్ నాగేశ్వరరావు.. తెలుగు ఇండస్ట్రీలో ఇపుడు ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. నిజానికి రెండు మూడేళ్లుగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ వస్తుందంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. దీని గురించి వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే క్లారిటీ మాత్రం లేదు. దర్శకుడు వంశీ ఈ సినిమా కథ పట్టుకొని తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు దగ్గరికి తిరిగాడు. ఎందుకో తెలియదు మన హీరోలు టైగర్ బయోపిక్‌లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆమధ్య రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ అనారోగ్య కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు రానా. ఆ తరువాత మరో ఇద్దరు హీరోల దగ్గరికి టైగర్ నాగేశ్వరరావు కథ వెళ్లింది. అక్కడి నుంచి కూడా నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ సినిమాను రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్నాడు వంశీ.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. దీపావళికి ముందు రోజు పోస్టర్ కూడా విడుదల చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానులు కూడా హంగామా చేశారు. అయితే ఇక్కడే మొదలైంది అసలు కథ. రవితేజ పోస్టర్ విడుదల చేసిన 24 గంటల్లోపే స్టూవర్టుపురం దొంగ ( Stuartpuram Donga ) అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరొక పోస్టర్ విడుదల చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది కూడా టైగర్ నాగేశ్వరరావు కథ కావడం. కేఎస్ దర్శకత్వంలో ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈయన నిర్మిస్తున్న సినిమా ఇది. దీనికోసం బెల్లంకొండ శ్రీనివాస్ చాలా మేకోవర్ అయ్యాడు. ఆయన ఫస్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఒకవైపు రవితేజ అదే కథతో సినిమా చేస్తున్నాడు. మరొకవైపు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా సేమ్ టు సేమ్ కథతో వస్తున్నాడు. ఇలా ఒకే కథను ఇద్దరు హీరోలు చేస్తే కచ్చితంగా నష్టం తప్పదు. ఎవరు ముందుగా వస్తే వాళ్లు లాభపడతారు. కానీ ఇలా ఒకరి జీవితాన్ని ఇద్దరు హీరోలు ఒకే సమయంలో నటించడం అనేది మంచిది కాదు అంటున్నారు విశ్లేషకులు. మరి రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్ లలో ఎవరు టైగర్ బయోపిక్ నుంచి డ్రాప్ అవుతారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ఆ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమా? గంటలోనే ఎలా ప్రాణాలు పోయాయి?
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీతో సాయి ధరమ్ తేజ్.. ప్రమాదం తర్వాత తొలి ఫొటో
రొమాంటిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆకాశ్ పూరీ జస్ట్ యావరేజ్..
వరుడు కావలెను ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. నాగ శౌర్యకు మరో ఫ్లాప్ తప్పేలా లేదుగా..
Samantha: అదే అసలైన ఐశ్వర్యం అంటున్న సమంత
Katrina Kaif: కత్రినా- విక్కీ వివాహం పక్కా.. వెడ్డింగ్ కార్డ్స్ అందుకే ఇవ్వడం లేదట..!
Rajinikanth: రజనీ సినిమా చూసేందుకు ఈ రోజు సెలవు ప్రకటించిన చెన్నై కంపెనీ