Rajinikanth: రజనీ సినిమా చూసేందుకు ఈ రోజు సెలవు ప్రకటించిన చెన్నై కంపెనీ

అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ని షేక్ చేసే సత్తా రజనీకాంత్‌కి ఉంది. బస్ కండక్టర్ నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు రజనీకాంత్ నట ప్రస్థానం సాగింది. ఈ మధ్యలో ఎన్నో కష్టాలు,నష్టాలు చవిచూశారు. అభిమానులని అలరించేందుకు ఇప్పటికీ సినిమాలు చేస్తున్న రజనీకాంత్ రీసెంట్గా అన్నాత్తె చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. తెలుగులో ఈ చిత్రం పెద్దన్నగా విడుదలైంది.
రజనీకాంత్ సినిమా అంటే ఏ రేంజ్లో హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో కొన్ని కంపెనీలు రజనీకాంత్ సినిమా చేసేందుకు సెలవులు కూడా ప్రకటించాయి. ఇప్పుడు అన్నాత్తె సినిమా కోసం చెన్నైలోని న్యూవే అనే కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నవంబర్ 5న అంటే ఈరోజు తమ ఉద్యోగాలు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే మూవీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఈ విషయం తెలిసి మిగతా వారు కూడా తమకు ఇలాంటి ఆఫర్స్ వరిస్తే బాగుండని అనుకుంటున్నారు.
అన్నా చెల్లెలు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన అన్నాత్తె మూవీలో కీర్తి సురేష్ రజినీ చెల్లెలుగా నటించింది. ఇక తలైవా సరసన నయనతార హీరోయిన్గా నటించగా.. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించారు. తొలి రోజు ఈ చిత్రం పెద్దగా కలెక్షన్స్ సాధించకపోవడం గమనర్హం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

