Romantic movie first week collections | పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా అనిల్ పడూరి తెరకెక్కించిన సినిమా రొమాంటిక్. ఈ సినిమాకు పూరీ కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాశాడు. దీంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అక్టోబర్ 29న విడుదలైన ఈ సినిమాకు తొలి రోజే టాక్ తేడాగా వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం పర్లేదనిపించాయి. సినిమాలో రొమాన్స్ తప్ప కథ లేదు అంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. కానీ పూరీ జగన్నాథ్ అనే పేరు సినిమాలో ఉన్న రొమాన్స్ కారణంగా కలెక్షన్స్ తొలి మూడు రోజులు బాగానే వచ్చాయి. సినిమా ఎలా ఉంది అని అడగడం మానేసి.. కేతిక శర్మ సంపేసిందిరా బాబూ.. ఏం గ్లామర్ రా నాయనా అది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందుకే ఈ సినిమాకు పర్లేదు అనేలా వసూళ్లు వచ్చాయి. సినిమాలో విషయం తక్కువ.. రొమాన్స్ ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ వరకు వెళ్లడానికి ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రొమాంటిక్ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. మరి రొమాంటిక్ తొలివారం కలెక్షన్స్ ఎన్ని.. ఇంకా ఎన్ని కోట్లు వస్తే సినిమా సేఫ్ అనేది చూద్దాం..
నైజాం: 1.24 కోట్లు
సీడెడ్: 0.68 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.44 కోట్లు
గుంటూరు: 0.28 కోట్లు
ఈస్ట్: 0.27 కోట్లు
వెస్ట్: 0.20 కోట్లు
కృష్ణా: 0.24 కోట్లు
నెల్లూరు: 0.17 కోట్లు
ఏపీ + తెలంగాణ: 3.52 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.18 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 3.70 కోట్లు షేర్
మూడు రోజుల్లో రొమాంటిక్ సినిమాకు రూ.3.21 కోట్లు వస్తే.. ఆ తర్వాత నాలుగు రోజులకు కేవలం రూ. 49 లక్షలు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. దాన్ని బట్టి కలెక్షన్స్ ఎంత దారుణంగా పడిపోయాయి అర్థం చేసుకోవచ్చు. రొమాంటిక్ సినిమాను రూ. 4.82 కోట్లకు అమ్మారు. అంటే మరో కోటికి పైగా వస్తేనే కానీ సినిమా సేఫ్ అవ్వదు. ఇప్పటికే చాలా చోట్ల కలెక్షన్ గ్రాఫ్ పడిపోయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: అదే అసలైన ఐశ్వర్యం అంటున్న సమంత
Suma: సుమ కనకాలకు రామ్ చరణ్ సపోర్ట్.. రేపు ఫస్ట్ లుక్ విడుదల
Katrina Kaif: కత్రినా- విక్కీ వివాహం పక్కా.. వెడ్డింగ్ కార్డ్స్ అందుకే ఇవ్వడం లేదట..!
Rajinikanth: రజనీ సినిమా చూసేందుకు ఈ రోజు సెలవు ప్రకటించిన చెన్నై కంపెనీ