Tiger 3 Movie | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంఛైజీలో ఇంతకుముందు వచ్చిన ‘ఎక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు నమోదు చేశాయి. కాగా.. ఇప్పుడు ఇదే జోనర్లో ‘టైగర్ 3’ వచ్చింది. మనీశ్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘టైగర్ 3’ (Tiger 3). కత్రినాకైఫ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిల్తుస్తోంది.
టైగర్ 3 ఇప్పటివరకు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టింది. వీటిలో ఇండియా నుంచి రూ.220 కోట్లకు పైగా.. ఓవర్సీస్ నుంచి 80 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి మెలోడి సాంగ్ రువాన్ (Ruaan) సాంగ్కు సంబంధించి మేకర్స్ ఫుల్ వీడియో విడుదల చేశారు. ఈ పాటను అరిజిత్ సింగ్ పాడాగ.. ఇర్షాద్ కమిల్ సాహిత్యం ప్రీతమ్ సంగీతం అందించారు.
Tiger & Zoya’s story is one of a kind. #Ruaan full song out now – https://t.co/eBKUNSfzkt
Watch #Tiger3 at your nearest big screen in Hindi, Tamil & Telugu.
Book your tickets now – https://t.co/K36Si5lgmp | https://t.co/RfOSuJumYF #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/tdQ2iFpZfd
— Yash Raj Films (@yrf) November 20, 2023