కృష్ణవంశీ, మోక్ష జంటగా రూపొందిన చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్‌రెడ్డి దర్శకుడు. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్స్‌మీట్ నిర్వహించింది. ‘ప్రేక్షకదేవుళ్లని ఎందుకంటారో మా సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే అర్థమైంది. తొలి సినిమాకు ఇంతమంచి కేరక్టర్ దొరకడం నిజంగా అదృష్టం. ఆ అదృష్టాన్నిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. మోక్ష బెస్ట్ కోస్టార్. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టే ఈ విజయం’ అని హీరో కృష్ణవంశీ ఆనందం వెలిబుచ్చారు. దర్శక,నిర్మాతలు పాషన్‌తో తీసిన సినిమా ఇదని, ఇందులో తాను చేసిన ధరణి పాత్ర తన ఒరిజినల్ కేరక్టర్‌కి దగ్గరగా ఉంటుందని కథానాయిక మోక్ష చెప్పారు. సినిమా విజయం పట్ల దర్శక, నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు.