Vijay Deverakonda | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నేడు ప్రెస్ మీట్‌ను నిర్వహించింది చిత్రయనిట్. ఈ మీట్లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ప్రేక్షకులను మోసం చేయవద్దనే ఈ సినిమా కథను బయటపెట్టామని తెలిపాడు.
ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు అంచనాలతో ప్రేక్షకులను సినిమాకు రాకుడదు అనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా కథను ట్రైలర్లో రివీల్ చేశాం. అంతేగాని వేరే ఆలోచన లేదు. ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి వచ్చినప్పుడు వారికి ఒక అంచనా ఉండాలి. ఈ సినిమాతో గౌతమ్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఇది జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ అంటూ నాగవంశీ చెప్పుకోచ్చాడు.