కోలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టి.. టాలీవుడ్లో లీడింగ్ పొజిషన్‌కు చేరి.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది పూజాహెగ్డే (Pooja Hegde). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ భామను తమ సినిమాలో తీసుకోవాలని క్యూలో ఉండే దర్శకనిర్మాతలు చాలా మందే ఉంటారు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన పూజాహెగ్డే ప్రస్తుతం షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ ఖాతాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, మహేశ్‌బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28, రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సర్కస్ (Cirkus) సినిమాలున్నాయి. పూజాహెగ్డే చేస్తున్న ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్‌వే.
అయితే కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తనకు అతిపెద్ద సినిమా ఏంటో చెప్పింది. తాను ఇప్పటివరకు నటించిన సినిమాల్లో రోహిత్‌శెట్టి-రణ్వీర్ సింగ్ కాంబోలో వస్తున్న సర్కస్ అతిపెద్దదని వెల్లడించింది. సర్కస్ ట్రైలర్ రేపు విడుదల కానుంది.
ఈ ఏడాది బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడంతో.. సర్కస్ సినిమాపై పూజాహెగ్డే చాలా ఆశలే పెట్టుకుంది. ఒకవేళ ఈ మూవీ సక్సెస్ అయితే మాత్రం పూజాహెగ్డే ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాదని అంటున్నాడు ట్రేడ్ విశ్లేషకులు.
Read also :Hunt | సుధీర్‌బాబు టీం నుంచి హంట్ సినిమా కొత్త అప్డేట్
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో