Mirzapur | ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ తెరకెక్కిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెబ్ సిరీస్‌గా ‘మిర్జాపూర్’కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా వంటి పాత్రలు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశాయి. ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరింత భారీ స్థాయిలో థియేటర్లకు తీసుకురావడంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
సెప్టెంబర్ 4న సినిమా విడుదల కానుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకు దేశంలోని ప్రముఖ నేషనల్ చైన్స్ అయిన పీవీఆర్,ఐనాక్స్, సినీ పోలీస్‌లలో కలిపి 30 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పటికే భారీగా పాపులారిటీ సంపాదించిన ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ స్థాయి స్పందన రావడం ఆసక్తికరంగా మారింది. విడుదల సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘మిర్జాపూర్: ది మూవీ’కి మొదటి రోజు సుమారు రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓటీటీ వెబ్ సిరీస్ నుంచి థియేటర్లలోకి అడుగుపెడుతున్న చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్ రావడం విశేషంగా నిలుస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
అయితే సినిమా విడుదల తర్వాత వచ్చే టాక్, రివ్యూలు, ప్రేక్షకుల స్పందనపై లాంగ్ రన్ కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ‘మిర్జాపూర్’ అభిమానులు థియేటర్లకు ఎంతమేర తరలివస్తారన్నది కీలకంగా మారనుంది. ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, అమెజాన్ MGM స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. వెబ్ సిరీస్‌లో తమదైన నటనతో ఆకట్టుకున్న పలువురు కీలక నటులు సినిమాలోనూ కనిపించనున్నారు.పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ‘మిర్జాపూర్’ సిరీస్‌ను ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఈ సినిమా మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోష్ చూస్తుంటే ‘మిర్జాపూర్: ది మూవీ’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.