టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) గ్లామర్ రహస్యమేంటని అడిగితే..అందరూ జిమ్, యోగా అని ఠక్కున చెప్పేస్తారు. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో ఈ విషయం ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయింది. రకుల్ కు గ్లామర్ వెనుక మరొక సీక్రెట్ కూడా ఉందని తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్టుతో అర్థమవుతుంది. తాజాగా రకుల్ పెరుగన్నం (curd rice) తింటున్న స్టిల్ ను పోస్ట్ చేసింది. మనం ఆరోగ్యంగా ఉండేందుకు, మనకు ఉబ్బరం లేకుండా ఉంచడానికి పెరుగన్నం సహాయపడుతుంది అని చెప్తోంది రకుల్.
బియ్యం పెరుగును ట్విస్ట్ చేయండి. కొంత భారతీయ పెరుగు, కొంత చియా పుడ్డింగ్‌ని ఆస్వాదిస్తున్నా. పెరుగులో ఉండే ప్రత్యక్ష సూక్ష్మజీవులు, చియాలోని ఫైబర్ నా కడుపును ప్రశాంతంగా, ఉబ్బరం లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగన్నం తిన్న తర్వాత నాకు తేలికగా మరియు ఉల్లాసంగా అనిపించడం అదనపు లాభం. తప్పకుండా ఈ ఆహారాన్ని తిని చూడండి అని సలహా ఇచ్చింది. ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
రకుల్ ప్రస్తుతం తెలుగులో కొండపొలం సినిమాలో నటిస్తోంది.హిందీలో డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, మేడే చిత్రాలు ఈ భామ ఖాతాలో ఉన్నాయి.
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్