Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నేడు కల్కి 2898 ఏడీ ట్రైలర్ లాంఛ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడొక ఆసక్తికర వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే. మొదట కమల్ హాసన్ ఇందులో విలన్ అని వార్తలు రాగా.. తాను కేవలం అతిథి పాత్రలో కనిపిస్తారని చెప్పాడు ఉలగనాయగన్. ఇంతకీ మరి ఈ చిత్రంలో మెయిన్ విలన్ ఎవరనే దానిపై ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
తాజాగా బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్ అంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ బెంగాలీ నటుడు ఇటీవలే నాగ్ అశ్విన్ అఫీషియల్ ఇన్‌స్టా ఖాతాను ఫాలో అవడం మొదలుపెట్టడం విశేషం. మరి శాశ్వత ఛటర్జీకి సంబంధించి మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు.
ఇప్పటికే ప్రభాస్ యాక్షన్ మూడ్‌లో ఉన్న నయా పోస్టర్‌తో ఇవాళ రాత్రి 7 గంటలకు ట్రైలర్ లాంఛ్ కాబోతుందని తెలియజేశారు మేకర్స్. ట్రైలర్ నిడివి 3.10 నిమిషాలుండనుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ (Bhairava) పాత్రలో కనిపించనుండగా.. అతడి దోస్త్ బుజ్జి (Bujji)గా స్పెషల్ కారు సందడి చేయనుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
బుజ్జి, భైరవ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్..
బుజ్జి ప్రత్యేకతలివే..
WOW – This is a 6-tonne real futuristic car built by Mahindra and Jayem Automotive in Coimbatore for #Prabhas‘s upcoming sci-fi film #Kalki2898AD. This car plays a character role named #Bujji.
Credits: @autocarindiamagpic.twitter.com/QgEMEq6GXv
— MovieCrow (@MovieCrow) May 24, 2024