Akhanda 2 | తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ‘అఖండ 2’ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఎలాంటి సినిమాలకూ టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ‘అఖండ 2’ విషయంలో టికెట్ ధరలు పెంచి పొరపాటు జరిగిందని తన ప్రమేయం లేకుండానే శాఖాధికారులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. తాను గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంతో పాటు పంచాయతీ ఎలక్షన్స్‌లో బిజీగా ఉన్నందున ఈ విషయం తన దృష్టికి రాలేదని అందువలన తన శాఖ అధికారులు పొరపాటున టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని వివరణ ఇచ్చారు.
హీరోలకు అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు? నిర్మాతలకు, దర్శకులకు నేను చెప్పేది ఒకటే… టికెట్ ధరలు పెంచమని ఎవరూ మమ్మల్ని అడగకండి. ఇప్పటికే పెరిగిన ధరలతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు థియేటర్‌కి వెళ్లట్లేదు. ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా? అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించాడు.