Keerthy Suresh | నటి కీర్తి సురేశ్ తన భర్త ఆంటోని తట్టిల్‌తో కలిసి నేడు తొలి వివాహ వార్షికోత్సవాన్ని (First Wedding Anniversary) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె తమ వివాహ వేడుకకు సంబంధించిన స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. కీర్తి, తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌ను ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజుతో వారి వైవాహిక జీవితం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, కీర్తి సురేశ్ తమ పెళ్లి వేడుకలలోని అన్‌సీన్ (Unseen) చూడముచ్చటైన క్షణాలను జోడిస్తూ ఒక ఎమోషనల్ వీడియోను తయారు చేసి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో విడుదల చేశారు. ఈ వీడియోలో పెళ్లికి ముందు జరిగిన మెహందీ, సంగీత్ వేడుకల సందడితో పాటు, గోవాలో హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహ ఘట్టాలు ఉన్నాయి. భర్త ఆంటోనితో కలిసి ఆమె చేసిన సరదా డ్యాన్స్‌లు, ప్రేమతో ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, పెళ్లి వేదికపై ఆంటోనిని చూసి కీర్తి ఆప్యాయంగా నవ్వే దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.