ThiruVeer | జార్జిరెడ్డి, టక్ జగదీశ్, పరేషాన్ సినిమాలతో తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు తిరువీర్. ఇటీవలే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు తిరువీర్. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ అప్పుడే కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టేశాడు. తిరువీర్ కొత్త సినిమా ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా మొదలైంది.
భరత్ భూషణ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 19 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి భరత్ మాచిరాజు సంగీతం అందిస్తున్నాడు. సీహెచ్ కుశేందర్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్న ఈ మూవీ అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కానుంది.
ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన తిరువీర్ ఈ సినిమాతో ఇక సౌతిండియాలో మంచి పాపులారిటీ తెచ్చుకోవడం గ్యారంటీ అని తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది ఐశ్వర్యా రాజేశ్. మరి తిరువీర్-ఐశ్వర్యారాజేశ్ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.
Ganga Entertainment Production No. 2 Stated with Poojai 🪔
Starring ⭐ #ThiruveeR #Aishwaryarajesh
Direction : #Bharath
Releases in Telugu, Tamil, Malayalam and Kannada ✅ pic.twitter.com/vf0qVdI6z6
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) November 9, 2025
Telusu Kada OTT | ఓటీటీలోకి సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Mirnalini Ravi | డబ్స్మాష్ నుంచి హీరోయిన్.. లగ్జరీ కారు కొనుగోలు చేసిన నటి మృణాళిని