తిరువీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’.గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రవి పనస నిర్మాత. మంగళవారం హీరో తిరువీర్ పుట్టిన రోజుని పురస్కరించుకొని స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, తిరువీర పాత్ర పవర్‌పుల్‌గా ఉంటుందని, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నదని మేకర్స్ తెలిపారు. ఫరియా అబ్దుల్లా, రిషి, రవీందర్ విజయ్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ, సంగీతం: కేపీ, రచన-దర్శకత్వం: గోపి.జి.